క‌స్తూరి రంగ‌న్ నివేదిక‌పై నిర్ణ‌యం తీసుకుంటాం

బెంగ‌ళూరు : కస్తూరి రంగన్ నివేదిక పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో క్షేత్రస్థాయి సర్వే జరపాలన్న డిమాండ్‌పై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్ప‌ష్టం చేశారు. ఉడుపి జిల్లాలోని హెబ్రిలో స్థానికులు, వివిధ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రానికి తమ నిర్ణయాన్ని తెలియజేసే ముందు ఆ ప్రాంత ప్రజల ఆందోళనలను అర్థం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ , అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించేందుకు, ఆరు రాష్ట్రాల పరిధిలోని సుమారు 60,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పశ్చిమ కనుమలలో 37 శాతం భాగాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించాలని కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సు చేసింది.

తాము సెప్టెంబర్ 27 నాటికి కేంద్రానికి మా నిర్ణయాన్ని పంపాల్సి ఉందన్నారు. మీ అభిప్రాయాలను తెలుసు కోవడానికి మీరు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి తాము ఇక్క‌డికి వ‌చ్చామ‌న్నారు. మీరు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, కేరళ తరహాలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని సూచించారు. మేము ఈ సూచనలను పరిశీలించి, అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిస్తామని ప్ర‌క‌టించారు డీకే శివ‌కుమార్. రైతులు, కరువు పరిస్థితులు , కస్తూరిరంగన్ నివేదికకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను మూడు రోజుల పాటు ఏర్పాటు చేసింద‌న్నారు. సమావేశాల మొదటి రోజున ఈ నివేదికపై చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. శివమొగ్గ , చిక్కమగళూరు ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను తెలుసు కోవడానికి అక్కడికి కూడా వెళ్తానని శివకుమార్ ప్ర‌క‌టించారు.

  • Related Posts

    కొడాలి నాని సమక్షంలో వైసీపీలో భారీగా చేరికలు

    విజ‌య‌వాడ : మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలో శ‌నివారం ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు గుడ్లవల్లేరు మండలం పెంజంద్ర గ్రామానికి చెందిన పెద్ద సంఖ్యలో యువత కూడా పార్టీలో చేరారు. తన పుట్టిన రోజున…

    జీహెచ్ఎంసీ కార్మికులకు అండగా ఉంటా : తీన్మార్ మల్లన్న

    హైద‌రాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ)లో ప‌ని చేస్తున్న కార్మికుల‌కు భ‌రోసా ఇచ్చారు ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌. ఆయ‌న తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార యాత్రను చేప‌ట్టారు. ఇందులో భాగంగా తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *