కస్తూరిరంగన్ నివేదికపై కర్ణాటక అసెంబ్లీలో ప్రత్యేక చర్చ

బెంగళూరు : రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు కర్ణాటకలో 124 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లోనూ అంచనా ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో కస్తూరిరంగన్ నివేదికపై జరిగిన ప్రత్యేక చర్చలో కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాన్ని “ప్రత్యేక సమావేశం” అని పిలవడం సరికాదని, దీనిని రుతుపవన కాల సమావేశాల లో భాగంగా ఒక “ప్రత్యేక చర్చ”గా పరిగణించాలని కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. సమావేశం పదజాలం , విధాన పరమైన నిర్వహణపై ప్రతిపక్షం లేవనెత్తిన అభ్యంతరాన్ని స్వీకరిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. న్యాయ , పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కృష్ణ బైరే గౌడ అసెంబ్లీలో ఈ వివరణ ఇచ్చారు.

సభను ప్రత్యేక సమావేశంగా కాకుండా కొనసాగుతున్న రుతుపవన కాల సమావేశాల కొనసాగింపుగా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. కస్తూరిరంగన్ నివేదిక , పశ్చిమ కనుమలలోని రైతులు, నివాసితులపై దాని ప్రభావాల గురించి వాడివేడి చర్చ జరుగుతున్న తరుణంలో ఈ వివరణ వచ్చింది. ప్రజల ఆందోళనలను పరిష్కరించడానికి, సభ్యులు ఈ అంశంపై సమగ్రంగా చర్చించడానికి వీలుగా ఈ చర్చను ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలిపింది. బీజేపీ అంతరాయాల కారణంగా, వాస్తవానికి ఆగస్టు 27న ముగియాల్సిన రుతుపవన కాల సమావేశాలు ఆగస్టు 24నే నిరవధికంగా వాయిదా పడ్డాయి. పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సమావేశం జరిగిందని, కొత్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం దీని ఉద్దేశ్యం కాదని అధికార పక్షం పేర్కొంది. ప్రతిపక్షం లేవనెత్తిన అభ్యంతరాన్ని ప్రభుత్వం అంగీకరించిందని, ఈ కార్యక్రమాలను ప్రత్యేక చర్చగా పరిగణిస్తామని గౌడ చెప్పారు.

  • Related Posts

    సోనియా గాంధీ కేసు మెజిస్ట్రేట్ కు అప్ప‌గించిన కోర్టు

    న్యూఢిల్లీ : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసును తిరిగి మేజిస్ట్రేట్‌కు అప్పగించంది ఢిల్లీ కోర్టు. మేజిస్ట్రేట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులో తగిన కారణాలు లేవని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కొత్తగా…

    డీఎస్సీ స్కాంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి

    విజ‌య‌వాడ : డీఎస్సీ స్కాంపై CBI విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని YSRCP డిమాండ్ చేసింది. కుంభకోణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు నిష్పాక్షికమైన విచారణ జరపాలని , ఇందుకు బాధ్య‌త వ‌హిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *