జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న వాయుగుండం ప్ర‌భావం కార‌ణంగా రాష్ట్ర‌మంత‌టా భారీ ఎత్తున ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్ ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆరా తీశారు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. మ‌రో వైపు గురువారం వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. నేడు, రేపు కూడా వర్షాలు కురవనున్నాయ‌ని, వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు.

వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని ఆదేశించారు. నీటి ఉధృతితో రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడిన చోట వెంటనే పునరుద్ధరించాల‌ని అన్నారు సీఎం. వర్షానికి కొండ చరియలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాల‌ని, అవసరమైతే తరలించాల‌ని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కనిపించ కూడదన్నారు. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని అన్నారు. చెరువులు నింపడంపై ఫోకస్ పెట్టడంతో పాటు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాల‌న్నారు. క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి సాయం కోరినా వెంటనే స్పందించాలన్నారు.

  • Related Posts

    లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి

    అమ‌రావ‌తి : తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కాకినాడ జిల్లావ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తుండడంతో యంత్రాంగం మరో రెండు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వర్షాలు పూర్తిగా…

    వరద నియంత్రణ చర్యలు చేపట్టాలి : రామానాయుడు

    అమరావతి : రాష్ట్రంలో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. గురువారం తాజా ప‌రిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపధ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *