మ్యూజిక్ లెజెండ్ ఇళ‌య‌రాజాకు అరుదైన గౌర‌వం

ఆస్ట్రేలియా : సంగీత దిగ్గ‌జం ఇళ‌య‌రాజా కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆస్ట్రేలియాలో ప్రత్యేక స్టాంప్‌తో స‌త్క‌రించింది. సినిమా రంగంలో 50 ఏళ్ల అద్భుత ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని విక్టోరియా పార్లమెంటులో దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాను ఒక ప్రత్యేక స్మారక స్టాంప్‌తో సత్కరించారు. ఇది ఆయన అద్భుతమైన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తమిళనాడు ప్రభుత్వం ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని సన్మానించిన ఏడాది తర్వాత ఈ గౌరవం దక్కింది. ఇళయరాజా స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను పంచుకుని తన అభిమానులను, నెటిజన్లను ఆనంద పరిచారు. ఒక ప్రత్యేక స్మారక స్టాంప్ విడుదలతో నా ప్రస్థానాన్ని గుర్తించి గౌరవించినందుకు విక్టోరియా ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి ఎన్వర్ ఎర్డోగన్ ఎంపీకి, పార్లమెంటు సభ్యులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను.

తమిళనాడులోని ఒక చిన్న, మారుమూల గ్రామంలో జన్మించి, ఆస్ట్రేలియా పార్లమెంటులో గౌరవం పొందడం నిజంగా హృదయానికి హత్తుకునే విషయం. నా సంగీతానికి ప్రాణం పోసిన ఎంతోమందికి, నాతో కలిసి నడిచిన కళాకారులకు , నా స్వరకల్పనలను ఆదరించిన తరాల తరబడి శ్రోతలకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. విక్టోరియా ప్రభుత్వం పట్ల తన కృతజ్ఞతను తెలియ జేయడంతో పాటు ఆస్ట్రేలియా ప్రభుత్వం , పార్లమెంటు సభ్యులు తన 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని స్టాంప్ విడుదల ద్వారా తనకు అందించిన ఈ ప్రత్యేక గౌరవానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.

  • Related Posts

    ప్రీ-సేల్స్‌లో ‘ది ప్యారడైజ్ అరుదైన రికార్డ్

    అమెరికా : న్యాచురల్ స్టార్ నాని విదేశాల్లో, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో తెలుగు సినిమా ప్రేక్షకులలో బలమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. త‌న‌ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఇప్పుడు ఆ విదేశీ ప్రజాదరణ ప్రభావాన్ని చూపుతూ, అంతర్జాతీయ ప్రీమియర్‌లకు ముందే ఒక…

    చెక్ బౌన్స్ కేసుపై రాధ‌కు అంబిక స్ట్రాంగ్ కౌంట‌ర్

    చెన్నై : చెక్కులు బౌన్స్ మరియు ఆస్తి వివాదంపై సోదరి రాధకు నటి అంబిక గట్టి బదులిచ్చారు. 1980ల నాటి ప్రముఖ దక్షిణ భారత నటీమణులైన రాధ , అంబికల మధ్య కుటుంబ వివాదం తలెత్తింది. తన ఇంటి నుండి సంతకం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *