వనపర్తి జిల్లా : విద్యార్థులు తప్పకుండా రాజకీయాలలోకి రావాల్సిర అవసరం ఉందని అన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సైదులు గారు తీన్మార్ మల్లన్నని శాలువాతో సన్మానించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో సమావేశమైన తీన్మార్ మల్లన్న పలు అంశాలపై మాట్లాడారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల వైపే కాకుండా రాజకీయాల వైపు కూడా రావాలని పిలుపునిచ్చారు.
మన భవిష్యత్తును నిర్ణయించేది రాజకీయమే కాబట్టి విద్యార్థులు రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన “Political power is the master key” సిద్ధాంతాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుత జరుగుతున్న Genz ఉద్యమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని, సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసు కోవాలని సూచించారు. యువత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రజా సమస్యలపై స్పందించాలని, ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించాలని అన్నారు మల్లన్న. ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులతో కొన్ని కల్చరల్ ఆక్టివిటీస్ చేయించి వారిని ఉత్సాహ పరిచారు. అనంతరం విద్యార్థులందరికీ డిక్షనరీలు పంపిణీ చేశారు





