యూనివ‌ర్శిటీలు సాంస్కృతిక వారసత్వానికి నిలయాలు

హైద‌రాబాద్ : భార‌త దేశ మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలోని విశ్వ విద్యాల‌యాలు సాంస్కృతిక వార‌స‌త్వానికి నిల‌యాలుగా మారాయ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. సూర్యవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన ‘ప్రతిభా పురస్కారాల’ ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌సంగిస్తూ ఈ అరుదైన కార్య‌క్ర‌మంలో పాలు పంచుకోవ‌డం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచి, సమాజానికి దిక్సూచిగా నిలిచిన ప్రతిభా పురస్కార గ్రహీతలందరికీ నా హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాన‌ని పేర్కొన్నారు.

తెలుగు విశ్వ విద్యాలయం వంటి సంస్థలు కేవలం డిగ్రీలను అందించే కేంద్రాలుగా మాత్రమే కాకుండా మన సాంస్కృతిక వారసత్వానికి నిలయాలుగా విరాజిల్లాలని తాను ఆకాంక్షిస్తున్నాన‌ని అన్నారు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు. మాతృభాష కంటి చూపు వంటిదైతే, పరభాష కళ్లద్దాల వంటిది అని అన్నారు. చూపుకు అర్థం ఉండాలంటే ముందు కళ్లు ఉండాలి కదా! మన మూలాలను, నేపథ్యాన్ని విస్మరించకుండా మన సంస్కృతిని భావి తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. భాషాభివృద్ధి అనేది కేవలం వ్యక్తిగత కృషి కాదు, అది ఒక సామూహిక యజ్ఞం అన్నారు. ప్రతాపరెడ్డి స్ఫూర్తితో… మనమందరం ఏకతాటిపై నిలిచి ముందడుగు వేద్దాం అన్నారు.

  • Related Posts

    కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎన్నిక‌లు

    హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ (TS HOUSEFED) ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు జోన్ల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడ్డారు. మొత్తం 86 శాతం…

    మెట్రో ఆర్టీసీ కామ‌న్ పాస్ తో డిప్యూటీ సీఎం ప్ర‌యాణం

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం డిజిట‌ల్ టెక్నాల‌జీని మ‌రింత ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన సేవ‌ల‌ను వాట్సాప్ ద్వారా అందించే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా హైద‌రాబాద్ లోని న‌గ‌ర వాసుల‌కు తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *