మెట్రో ఆర్టీసీ కామ‌న్ పాస్ తో డిప్యూటీ సీఎం ప్ర‌యాణం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం డిజిట‌ల్ టెక్నాల‌జీని మ‌రింత ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన సేవ‌ల‌ను వాట్సాప్ ద్వారా అందించే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా హైద‌రాబాద్ లోని న‌గ‌ర వాసుల‌కు తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. ఈ మేర‌కు నిత్యం ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణం చేసే ఆర్టీసీ సిటీ బ‌స్సులు, మెట్రో రైలు ప్ర‌యాణీకుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఇందులో భాగంగా ఆర్టీసీ, మెట్రో కామ‌న్ పాస్ ల‌ను ప్ర‌వేశ పెట్టింది. దీంతో ర‌వాణా మ‌రింత సులువుగా మార‌నుంది.

ఇదిలా ఉండ‌గా హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌ ద్వారా బేగంపేట మెట్రో స్టేషన్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు మెట్రోలో, అక్కడి నుంచి సెక్రటేరియట్‌ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్, మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ . ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి కామన్ పాస్ వినియోగం, మెట్రో–ఆర్టీసీ అనుసంధానం, ప్రయాణ సౌకర్యంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించుకునేలా ప్రజా రవాణా వ్యవస్థను అనుసంధానం చేయడం ద్వారా ప్రయాణికులకు సమయం, శ్రమ ఆదా కావడంతో పాటు గమ్యస్థానానికి మరింత సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందన్నారు.

  • Related Posts

    కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎన్నిక‌లు

    హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ (TS HOUSEFED) ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు జోన్ల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడ్డారు. మొత్తం 86 శాతం…

    యూనివ‌ర్శిటీలు సాంస్కృతిక వారసత్వానికి నిలయాలు

    హైద‌రాబాద్ : భార‌త దేశ మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలోని విశ్వ విద్యాల‌యాలు సాంస్కృతిక వార‌స‌త్వానికి నిల‌యాలుగా మారాయ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. సూర్యవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన ‘ప్రతిభా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *