బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాలి : ఈట‌ల రాజేంద‌ర్

సికింద్రాబాద్ : రాష్ట్రంలో త్వరలో జరగనున్న మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి (అర్బన్) జిల్లా పార్టీ కార్యాలయంలో కీలక నాయకులు, జిల్లా బాధ్యులతో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఈ సందర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎంపీ. బీజేపీ అభ్యర్థుల విజయమే ఏకైక లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే అనుసరించాల్సిన వ్యూహాలు , కార్యాచరణ ప్రణాళికపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో అర్బన్ జిల్లా అధ్యక్షుడు డి. గిరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల్లు వీరేందర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, రాష్ట్ర అధికార ప్రతినిధి తాడురి శ్రీనివాస్, జిల్లా ఇన్‌చార్జ్ సెవెళ్ల మహేందర్, మాజీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ఇన్‌చార్జ్ మహేందర్, మాజీ కార్పొరేటర్లు, జిల్లా బాధ్యులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    యూనివ‌ర్శిటీలు సాంస్కృతిక వారసత్వానికి నిలయాలు

    హైద‌రాబాద్ : భార‌త దేశ మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలోని విశ్వ విద్యాల‌యాలు సాంస్కృతిక వార‌స‌త్వానికి నిల‌యాలుగా మారాయ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. సూర్యవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన ‘ప్రతిభా…

    మెట్రో ఆర్టీసీ కామ‌న్ పాస్ తో డిప్యూటీ సీఎం ప్ర‌యాణం

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం డిజిట‌ల్ టెక్నాల‌జీని మ‌రింత ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన సేవ‌ల‌ను వాట్సాప్ ద్వారా అందించే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా హైద‌రాబాద్ లోని న‌గ‌ర వాసుల‌కు తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *