కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎన్నిక‌లు

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ (TS HOUSEFED) ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు జోన్ల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడ్డారు. మొత్తం 86 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాల్లో ముదిగంటి శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాండభేరి గోపరాజు, పట్లోళ్ల శంకర్ రెడ్డి, పామర్తి అంకినీడి ప్రసాద్, గౌడ్ కిషన్ రావు, రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి డైరెక్టర్లుగా విజయం సాధించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడటంతో విజేతల అనుచరులు, మద్దతుదారుల్లో ఉత్సాహం నెలకొంది. ఎన్నికల ప్రక్రియను సొసైటీల ప్రతినిధులు, ఓటర్లు ఆసక్తిగా పరిశీలించారు. డైరెక్టర్లుగా ఎన్నికైన వారికి ఎన్నికల అధికారి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లకు పలువురు సొసైటీల ప్రతినిధులు, నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ గా ఎన్నికైన బ్ర‌హ్మాండ‌గిరి గోప‌రాజు స్పందించారు. త‌మ‌పై న‌మ్మ‌కం ఉంచి విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు.

  • Related Posts

    యూనివ‌ర్శిటీలు సాంస్కృతిక వారసత్వానికి నిలయాలు

    హైద‌రాబాద్ : భార‌త దేశ మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలోని విశ్వ విద్యాల‌యాలు సాంస్కృతిక వార‌స‌త్వానికి నిల‌యాలుగా మారాయ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. సూర్యవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన ‘ప్రతిభా…

    మెట్రో ఆర్టీసీ కామ‌న్ పాస్ తో డిప్యూటీ సీఎం ప్ర‌యాణం

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం డిజిట‌ల్ టెక్నాల‌జీని మ‌రింత ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన సేవ‌ల‌ను వాట్సాప్ ద్వారా అందించే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా హైద‌రాబాద్ లోని న‌గ‌ర వాసుల‌కు తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *