అస‌భ్య‌క‌ర పోస్టుల‌పై ఎమ్మెల్సీ బ‌ల్మూరి ఫిర్యాదు

హైద‌రాబాద్ : ఈ మ‌ధ్య‌న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిప‌క్షంలో ఉన్న బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తూ మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం అన్ని పార్టీల‌కు ఓ ఆయుధంగా మారింది సోష‌ల్ మీడియా. బీజేపీ ఏకంగా టాప్ లో కొన‌సాగుతుండ‌గా ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్, బీజేపీ త‌ర్వాతి స్తానాల‌లో కొన‌సాగుతున్నాయి. ఇక ఒక‌రిపై మ‌రొక‌రు పోస్టులు షేర్ చేస్తూ దుమ్ము రేపుతున్నారు. మ‌రికొంద‌రు ఫేక్ ఐడీలు, ఖాతాల‌తో దిగ‌జారి పోయి షేర్ చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర‌మైన పోస్టులు పెట్ట‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ రావు. డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసి తనపై సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకరమైన పోస్ట్‌ల గురించి ఫిర్యాదు చేశారు. దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు .బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని డీజీపీ హమీ ఇచ్చార‌ని తెలిపారు .

  • Related Posts

    క‌ర్ణాట‌క‌లో 6వ త‌ర‌గ‌తి నుండే ఏఐపై శిక్ష‌ణ : సీఎం

    బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇక నుంచి 6వ త‌ర‌గ‌తి నుండే ఏఐపై శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం డీకే శివ‌కుమార్. పాఠశాలల్లో ఏఐ శిక్షణను అందించడానికి గూగుల్ ఆసక్తి చూపింద‌న్నారు.…

    ద‌స‌రా పండుగ‌కు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్సులు

    అమ‌రావ‌తి : ఏపీఎస్ఆర్టీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ద‌స‌రా సెలువులు ప్ర‌క‌టించ‌డంతో ఏపీఎస్ఆర్టీసీ కీల‌క నిర్న‌యం తీసుకుంది. దసరా రద్దీ దృష్ట్యా APSRTC ప్రత్యేక బస్సులు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. దసరా ప్రయాణ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల నుంచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *