న‌మ్మ‌క ద్రోహుల‌ను ఉప ఎన్నిక‌ల్లో ఓడించండి

చెన్నై : మరిన్ని ద్రోహ చర్యలను అడ్డుకోవడానికి టీవీకే అభ్యర్థులను ఉప ఎన్నిక‌ల్లో ఓడించాల‌ని పిలుపునిచ్చారు ఏఐఏడీఎంకే చీఫ్ ప‌ళ‌నిస్వామి. జయలలిత నాయకత్వం వహించిన పార్టీకి ద్రోహం చేసినవారే ఇప్పుడు టీవీకే అభ్యర్థులుగా మారారని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి అన్నారు. మధురాంతకం , ధరాపురం ఉప ఎన్నికల ప్రచారం ముగిసే ముందు ఓటర్లకు చేసిన తన చివరి విజ్ఞప్తిలో ‘ద్రోహం , అధికార దుర్వినియోగం’కు తగిన గుణపాఠం చెప్పేలా అన్నా డీఎంకేకు ఓటు వేయాలని ఆయన కోరారు. తమ పార్టీకి ద్రోహం చేయాలనే ఆలోచన ఎవరికీ రాకుండా చేసే తీర్పును ఇచ్చి, ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు చరిత్ర సృష్టించాలని పళనిస్వామి అన్నారు.

అసెంబ్లీలో మెజారిటీ లేకపోయినప్పటికీ, వివిధ ఎత్తుగడల ద్వారా ఇతర పార్టీల మద్దతుతో తమిళగ వెట్రి కళగం అల్పసంఖ్యాక ప్రభుత్వ (మైనారిటీ ప్రభుత్వం)ను నడుపుతోందని ఆయన పేర్కొన్నారు. త‌మ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలతో టీవీకే ‘హార్స్-ట్రేడింగ్’ (అడ్డదారిలో ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం)కు పాల్పడిందని ఆరోపించారు. కొందరు ‘ద్రోహులు’ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరడం వల్లే మధురాంతకం , ధరాపురంలో ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన మండిప‌డ్డారు. వారు మళ్లీ ఓట్లు అడుగుతుండటంతో ప్రజల నుండి వారిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి భయంతో టీవీకే ప్రజల ఓట్లను పొందడానికి తప్పుడు మార్గాలను ఆశ్రయిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. అల్పసంఖ్యాక ప్రభుత్వాన్ని మెజారిటీ ప్రభుత్వంగా మార్చడానికి టీవీకే తెరవెనుక చేస్తున్న చర్యలకు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. త‌మ అభ్యర్థుల విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • Related Posts

    గృహ నిర్మాణంలో రుణ దొంగతనం : వైఎస్సార్సీపీ

    అమ‌రావ‌తి : నెల్లూరు జిల్లాలోని ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత జాబితాలో చేర్చనందుకు సంకీర్ణ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు గుప్పించింది. పేదల గృహ నిర్మాణంలో ప్రభుత్వం రుణ దొంగతనానికి పాల్పడిందని ఆరోపించింది. జిల్లాలోని 35 మండలాల్లో ఏ ఒక్కదాన్నీ కరువు…

    క‌ర్ణాట‌క‌లో 6వ త‌ర‌గ‌తి నుండే ఏఐపై శిక్ష‌ణ : సీఎం

    బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇక నుంచి 6వ త‌ర‌గ‌తి నుండే ఏఐపై శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం డీకే శివ‌కుమార్. పాఠశాలల్లో ఏఐ శిక్షణను అందించడానికి గూగుల్ ఆసక్తి చూపింద‌న్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *