నిర్మ‌లా సీతారామ‌న్ తో సీఎం చంద్ర‌బాబు భేటీ

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ను త‌న కార్యాల‌యంలో క‌లిశారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌ధానంగా త‌మ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు నారా చంద్ర‌బాబు నాయ‌యుడు. మదనపల్లెలో ఇటీవల ప్రారంభమైన ‘రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ ప్రాజెక్ట్ కార్యక్రమానికి ఆమె హాజరైనందుకు , ఆ ప్రాజెక్ట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు ఆయన ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ సహకారంతో చేపట్టే ప్రాజెక్టులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి పెద్ద ఎత్తున నిధులు కేంద్రం నుంచి రావాల్సిన విష‌యాన్ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు వివ‌రించారు. దీని వ‌ల్ల ఆర్థిక భారం త‌మ‌పై ప‌డుతోంద‌ని, త‌క్ష‌ణ‌మే ఏపీకి రావాల్సిన నిధుల‌ను వెంట‌నే మంజూరు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర మంత్రిని కోరారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మ‌రో వైపు పోలవ‌రం ప్రాజెక్టు నిర్మాణం ప‌నులు త్వ‌రిత‌గ‌తిన కొన‌సాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు త‌క్ష‌ణ‌మే మిగిలి పోయిన నిధులు మంజూరు చేయాల‌న్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ , పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా పాల్గొన్నారు.

  • Related Posts

    దృఢమైన పట్టణ రవాణా వ్యవస్థ నిర్మాణం అవ‌స‌రం

    బెంగ‌ళూరు : దృఢమైన పట్టణ రవాణా వ్యవస్థ నిర్మాణం అవ‌స‌రం అని పేర్కొన్నారు సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ శ్రీ‌జ‌న‌. గురువారం బెంగళూరులో జరిగిన ‘మొబిలిటీ సింపోజియం 2026స‌లో క‌మిష‌న‌ర్ పాల్గొన్నారు. ఇందులో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్; గ్రేటర్ బెంగళూరు…

    సైబ‌ర్ నేరాల‌పై అవగాహ‌న కోసం ‘జాగృత దివస్’

    హైద‌రాబాద్ : సైబర్ నేరాలపై ప్రజల అవగాహనను బలోపేతం చేయడానికి , సురక్షితమైన డిజిటల్ పద్ధతులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన అవగాహన కార్యక్రమమైన “సైబర్ జాగృత దివస్ పోస్టర్ ఆవిష్కరణ”ను సైబరాబాద్ కమిషనరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. సైబర్ మోసాల పెరుగుతున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *