శ్రీ‌శైలం మాస్ట‌ర్ ప్లాన్ పై డిప్యూటీ సీఎం స‌మీక్ష

Spread the love

ఇత‌ర ఆల‌యాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా ఉండాలి

అమ‌రావ‌తి : శ్రీ‌శైలం అభివృద్దికి సంబంధించి మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మాస్ట‌ర్ ప్లాన్ పై మంగ‌ళ‌వారం కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, ఇరు శాఖ‌ల‌కు సంబంధించిన ఉన్న‌తాధికారులు హాజ‌రయ్యారు. ఈ సమావేశంలో దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు.

సమావేశంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ హరి జవహర్‌లాల్, దేవాదాయశాఖ కమిషనర్ రామ చంద్ర‌ మోహన్ , పీసీసీఎఫ్ శ్రీ చలపతి రావు , అదనపు పీసీసీఎఫ్ శాంతి ప్రియ పాండే హాజ‌ర‌య్యారు. యుద్ద ప్రాతిప‌దిక‌న ప్లాన్ త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌ధానంగా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఇదిలా ఉండ‌గా ఈనెల 16న దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ శ్రీ‌శైలంలోని శ్రీ భ్ర‌మ‌రాంబికా మ‌ల్లికార్జున స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకోనున్నారు. ఈ స‌మ‌యంలో కీల‌క స‌మ‌వేశం నిర్వహించ‌డం విశేషం.

  • Related Posts

    గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

    Spread the love

    Spread the loveఅంద‌జేస్తామ‌న్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల స‌ర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు…

    డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు

    Spread the love

    Spread the loveతెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌ హైద‌రాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *