మాజీ మంత్రి కడియం శ్రీహరి కామెంట్స్
వరంగల్ జిల్లా : మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ , ఎన్నడూ గూండాయిజం చేయలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కబ్జాలకు పాల్పడలేదని, బెదిరించ లేదని, వసూళ్లకు పాల్పడ లేదని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ రెడ్డి కథ సుఖాంతం అయ్యిందని అన్నారు. తాను ఏనాడూ చిల్లర రాజకీయాలు చేయ లేదన్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడనేది చర్చనీయాంశంగా మారంది. కాగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేశాడా లేక కొండా సురేఖ, కొండా మురళిని ఉద్దేశించి చేశాడా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో చోటు చేసుకుంది దెక్కన్ సిమెంట్స్ వ్యవహారం.
ఈ ఘటనలో సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్. ఆమె ఏకంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని, ఆయన సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిల గురించి సీరియస్ కామెంట్స్ చేశారు. వారికి ఎలాంటి పదవులు లేకుండానే ఎలా గన్ మెన్లను ఇచ్చారంటూ నిలదీశారు. ఒక కేబినెట్ మంత్రిగా ఉన్న తన తల్లి ఇంటికి పోలీసులు, మఫ్టీలో ఉన్న వారు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ తరుణంలో ఓరుగల్లు జిల్లాకు చెందిన నేతలు ఇలా మూకుమ్మడిగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారి తీసేలా చేసింది.






