ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్

Spread the love

పుకార్లను నమ్మవద్దు.. ప్రశాంతంగా ఉండండి

అమ‌రావ‌తి : ఏపీకి విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. సీఎం టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దని సూచించింది ఏపీఐఎండీ. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండాల‌ని , వాతావరణ హెచ్చరికలు కోసం SMS లను గమనించాల‌ని పేర్కొంది. రేడియో/టీవీ న్యూస్ చూడండి, వార్తాపత్రికలు చదవండి. మీ పత్రాలు/సర్టిఫికెట్స్ మరియు విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లు/కవర్ లో ఉంచాల‌ని తెలిపింది. ఖాళీ గదిలో ఉండటానికి ప్రయత్నించండి. అదేవిధంగా వస్తువులు కదలకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. భద్రత మరియు మనుగడ కోసం అవసరమైన వస్తువులతో “అత్యవసర వస్తు సామగ్రిని” సిద్ధం చేసుకోండి. మీ ఇంటిని ముఖ్యంగా పైకప్పును భద్రపరచుకోండి, ఏమైనా మరమ్మతులు ఉంటే చేపట్టండి, ఇంట్లో పదునైన వస్తువులను వదులుగా ఉంచవద్ద‌ని సూచించింద‌.ఇ

పశువులు / జంతువులను పూర్తిగా వాటికి కట్టిన తాడును విప్పి వాటిని వదిలి వేయండి . తుఫాను ఉప్పెన / ఆటుపోట్ల హెచ్చరిక లేదా వరదలు వచ్చినప్పుడు, మీ సమీప సురక్షితమైన ఎత్తైన భూమి / సురక్షితమైన ఆశ్రయం పొందండి. దానికి సురక్షితమైన మార్గం ను తెలుసుకోండి. కనీసం ఒక వారం పాటు ఉండటానికి తగినంత ఆహారం, నీరు నిల్వలను సిద్ధం చేసుకోండి. మీ కుటుంబం కోసం, సంఘం కోసం నిర్వహించే కృత్రిమ విపత్తులు (మాక్ డ్రిల్స్) / శిక్షణ తరగతులలో పాల్గొనండి. స్థానిక అధికారుల అనుమతితో మీ ఇంటి దగ్గర చెట్ల కొమ్మలను కత్తిరించండి. తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసి వేయండి. ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెంటనే వెళ్ళండి.

ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ కనెక్షలను తీసివేయండి. తలుపులు, కిటికీలు మూసివేసి ఉంచండి. మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుఫాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకోండి. భవనం కూలి పోవటం జరుగుతుంటే, దుప్పట్లు, రగ్గులు లేదా దుప్పట్లతో లేదా బలమైన టేబుల్ లేదా బెంచ్ కిందకు దూరడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

  • Related Posts

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    Spread the love

    Spread the loveప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగ‌డుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్త‌లు రాస్తూ వ‌స్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను సింగ‌రేణి…

    కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveపాలేరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి షాకింగ్ కామెంట్స్ ఖ‌మ్మం జిల్లా : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *