నైపుణ్యాభివృద్దికి సహకరించండి
పిలుపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
దావోస్ – విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, కంపెనీల సిఇవోలు, చైర్మన్లు, ప్రధానులతో ఆయన భేటీ కానున్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. సీఎం వెంట రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్ , ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్దిపై ఫుల్ ఫోకస్ పెట్టామని, ఇందుకు సంబంధించి సహాయ సహకారాలు అందించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు పెట్టుబడిదారులు, దేశాల ప్రతినిధులు తమకు సహకరించాలని సూచించారు. ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల నుండి తెలంగాణ రాష్ట్రంలోని కళాశాల విద్యార్థులను మరింత విలువలతో కూడిన విద్య, ఉపాధి పొందేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
మెరుగైన, సుసంపన్నమైన జీవితం కోసం మానవ పరిస్థితులను మెరుగు పర్చేందుకు , ప్రభుత్వం, వ్యాపారాలు, ఇతర వాటాదారులు కలిసి ఎలా పని చేయొచ్చనే దానిపై తాము దృష్టి సారించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ప్రపంచ ఆర్థిక సదస్సు చీఫ్ తో భేటీ అయ్యారు.