DEVOTIONAL

నాద నీరాజ‌నం అఖండ‌ పారాయ‌ణం

Share it with your family & friends

తిరుమ‌ల‌లో ఘ‌నంగా కార్య‌క్ర‌మం

తిరుమ‌ల – తిరుమ‌ల‌లో గోవింద నామ స్మ‌ర‌ణ కొన‌సాగుతోంది. భ‌క్త బాంధ‌వులు శ్రీ‌వారిని ద‌ర్శించు కునేందుకు పోటెత్తారు. మ‌రో వైపు లోక క‌ళ్యాణం కోసం శ్రీనివాసుడిని ప్రార్థిస్తూ తిరుమ‌ల లోని నాద నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం 6వ విడ‌త అయోధ్య కాండ అఖండ పారాయణం జ‌రిగింది.

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మం 9 గంట‌ల వ‌ర‌కు నిర్విరామంగా కొన‌సాగింది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు ఈ అఖండ పారాయాణాన్ని వీక్షించారు. స్వామి వారి కృప త‌మ‌పై ఉండాల‌ని కోరుకున్నారు.

అయోధ్య కాండలోని 18 నుండి 21వ‌ సర్గ వ‌ర‌కు నాలుగు స‌ర్గ‌ల్లో 199 శ్లోకాలు, యోగ వాశిష్టం , ధ‌న్వంత‌రి మ‌హా మంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 224 శ్లోకాల‌ను పారాయణం చేశారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేద పండితులు, సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.