
ఈ దేశంలో కుల రక్కసి కుట్రలకు తెర లేపుతోంది. కోట్లాది మానవ సమూహాన్ని విభజించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్రమాదాకరమైనది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 79 ఏళ్లు గడిచినా కుల వివక్ష నుంచి కాపాడ లేక పోయామని, రూపుమాప లేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాన న్యాయమూర్తి. కుల వివక్ష, అంతులేని అసమానతలను పెంచేలా చేస్తోంది. దీనిని ఇప్పటికైనా నిర్మూలించేందుకు ప్రయత్నం చేయక పోతే రాచపుండులా మారి మనల్ని నిట్ట నిలువునా దహించి వేస్తోందని పేర్కొనడం ఆలోచించాల్సిన అంశం. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి చోటా ఈ వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేయడం పలు ప్రశ్నలను తట్టి లేపింది. ఈ కుల ఆధారిత విభజన చివరకు జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీలకు కూడా సోకడం క్షమించరాని నేరంగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. జైళ్లలో పని విభజనను అంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దశాబ్దాలు గడిచినా కుల వివక్షతో కూడిన దుర్మార్గాలు అలాగే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదో అతి పెద్ద దుర్మార్గం. దీనిని మనం నిర్మూలించ లేక పోయామని వాపోయారు.
న్యాయం, సమానత్వం కోసం పౌరులందరినీ కలుపుకుని పోయే జాతీయ దృక్ఫథాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉందని సీజేఐ స్పష్టం చేశారు. భారతదేశ భవిష్యత్తు గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లో తన చివరి ప్రసంగంలో వ్యక్తం చేసిన ఆందోళనలు నేటికీ నిజమని తీర్పు పేర్కొంది.
కాబట్టి, మన సమాజంలో ఇప్పటికే ఉన్న అసమానతలు , అన్యాయాలను గుర్తించడానికి నిజమైన శీఘ్ర చర్యలు అవసరం. పదాలు, చర్య లేకుండా, అణచివేతకు గురైన వారికి ఏమీ అర్థం కాదు అని కోర్టు పేర్కొంది. మనకు ఒక సంస్థాగత విధానం అవసరం, ఇక్కడ అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులు వారి భవిష్యత్తు గురించి వారి బాధలను , వేదనను సమిష్టిగా పంచుకోగలరు. బహిష్కరణ నమూనాలను గమనించడం ద్వారా అన్ని ప్రదేశాలలో వ్యవస్థాగత వివక్షను గుర్తించండి, అన్నింటికంటే, కులం హద్దులు ఉక్కుతో తయారు చేయబడ్డాయి. “కొన్నిసార్లు కనిపించవు కానీ దాదాపు ఎల్లప్పుడూ విడదీయలేవు”. కానీ రాజ్యాంగం శక్తితో వాటిని విచ్ఛిన్నం చేయలేమంటూ తీర్పును ముగించేటప్పుడు కోర్టు పేర్కొంది.
జైళ్లలో కుల ప్రాతిపదికన విభజనను ఎత్తి చూపుతూ జర్నలిస్టు సుకన్య శాంత దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తులతో క కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఖైదీల కులం వారి విభజన ఆధారంగా పనిని కేటాయించడానికి అనేక రాష్ట్రాల జైలు మాన్యువల్స్లోని నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమని కోర్టు కొట్టి వేసింది. అణగారిన కులాల పట్ల భారతదేశ చరిత్ర శతాబ్దాల వివక్షకు సాక్ష్యంగా ఉందని తీర్పు పేర్కొంది. ఈ వర్గాల పట్ల హింస, వివక్ష, అణచివేత, ద్వేషం, ధిక్కారం, అవమానాలు సాధారణం. కుల వ్యవస్థ సమాజంలో లోతుగా పాతుకు పోయింది, సహజ న్యాయ సూత్రాలను నిర్ద్వంద్వంగా విస్మరించే వాతావరణాన్ని సృష్టించింది. ఈ క్రమానుగత వ్యవస్థలో, తటస్థత వాస్తవంగా ఉనికిలో లేదు. అణగారిన కులాలకు చెందిన వారిపై స్వాభావికమైన, విస్తృతమైన పక్షపాతం ఉంది . వారి ప్రాథమిక హక్కులు గౌరవాన్ని అట్టడుగున ఉంచారు, కోల్పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం కులం ఇంకా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని చెప్పడానికి నిదర్శనం.
కులం ద్వారా నిర్వచించబడిన సామాజిక చట్రంలో అన్ని వ్యక్తులకు సమానత్వం అనే పునాది సూత్రం లేదు. కుల వ్యవస్థ బహుజన వర్గాల శ్రమతో అభివృద్ధి చెంది, చివరికి వారి గుర్తింపును క్షీణింపజేసే యంత్రాంగంగా పని చేసింది. మరో మాటలో చెప్పాలంటే, కుల వ్యవస్థ కథ కాబట్టి, అన్యాయాన్ని సహించే కథ ఇది, సామాజిక నిచ్చెనల దిగువకు దిగజారింది, కనికరంలే ని వివక్ష, దోపిడీని ఎలా ఎదుర్కొంది, విద్య, భూమి, ఉపాధికి క్రమపద్ధతిలో ప్రవేశం లేదు . సమాజంలో వారి ప్రతికూల స్థితిని స్థిర పరచడం. ఈ తీర్పు వర్ణ వ్యవస్థపై డా.అంబేద్కర్ రచనలను విస్తృతంగా ప్రస్తావించింది. ఈ తీర్పు కులం పునాదులపై ఏర్పడిన వ్యవస్థకు, సమాజానికి చెంప పెట్టు అని చెప్పక తప్పదు.