స్పష్టం చేసిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేప్టీపై అవగాహన కల్పించేందుకు ARRIVE ALIVE కార్యక్రమాన్ని డీజీపీ బి.శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా పోస్టర్ ను ఆవిష్కరించారు డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు. అనంతరం ప్రసంగించారు డీజీపీ . ఇటీవల రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. దీనికి ప్రధాన కారణం సరైన అవగాహన లేక పోవడంతో పాటు మితిమీరిన వేగం కూడా ప్రధాన కారణమని పేర్కొన్నారు శివధర్ రెడ్డి.
రోడ్డు ప్రమాదాల నివారణను ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగ తీసుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలో ప్రతి ఏటా సగటున 3 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రమాదాల్లో 300 వరకు దుర్మరణం చెందుతున్నారని వెల్లడించారు డీజీపీ శివధర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాపిక్ ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహారిస్తున్నామని చెప్పారు. ఇందుకు గాను ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేకించి సీపీ వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పారు.






