సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న చిక్రి చిక్రి

Spread the love

భారీ ఎత్తున ఆద‌రిస్తున్న అభిమానులు

హైద‌రాబాద్ : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది చిక్రీ చిక్రీ సాంగ్. బాలాజీ రాసిన ఈ సాంగ్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తో పాటు జాహ్న‌వి క‌పూర్ కీ రోల్స్ పోషించారు. ఏఆర్ రెహ‌మాన్ ఈ పాట‌కు స్వ‌రాలు కూర్చారు. అద్భుత‌మైన ట్యూన్ దీని స్వంతం. దీనికి జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశాడు. ఈ సాంగ్ విడుద‌లై నాటి నుంచి నేటి దాకా మిలియ‌న్స్ వ్యూస్ స్వంతం చేసుకుంది. అంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. ఒక ర‌కంగా అల్లా ర‌ఖా రెహ‌మాన్ మ్యాజిక్ చేసేశాడు. చిక్రి చిక్రి, రంగుల విజృంభణలా వచ్చింది .ఉత్సాహ భరితమైన, లయ బద్ధమైన పాట‌గా దీనిని మ‌లిచాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్.

భారతదేశ సంగీత ప్రకృతి దృశ్యాన్ని రూపొందిస్తున్న ఎ.ఆర్. రెహమాన్ మోహిత్ చౌహాన్ తో పాటించాడు. ఈ పాట తెలుగు, త‌మిళ్, హిందీ, క‌న్న‌డ , త‌దిత‌ర భాష‌ల‌లో దీనిని రూపొందించాడు. ఇక బుచ్చిబాబు స‌నకు రామ్ చ‌ర‌ణ్ తో తీస్తున్న మూవీ త‌న కెరీర్ ప‌రంగా ఇది రెండో మూవీ. త‌ను గ‌తంలో ఉప్పెన పేరుతో సినిమా తీశాడు. ఇందులో కొత్త హీరోయిన్ గా కృతీ శెట్టిని తీసుకు వ‌చ్చాడు. ఇక మోహిత్ చౌహాన్ అద్భుతంగా పాడాడు చిక్రి చిక్రి పాట‌ను. ఇది గ‌తంలో ఇప్ప‌టి వ‌ర‌కు చ‌రిత్ర సృష్టించిన అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ ల పాట‌ల‌ను తోసిరాజ‌ని టాప్ లో నిలిచింది. ఇటీవ‌లే హైద‌రాబాద్ వేదికగా సంగీత క‌చేరి నిర్వ‌హించాడు ఏఆర్ రెహ‌మాన్.

  • Related Posts

    త్రిషా కృష్ణ‌న్, న‌య‌న‌తార హ‌ల్ చ‌ల్

    Spread the love

    Spread the loveసోష‌ల్ మీడియాలో హీరోయిన్లు వైర‌ల్ చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు త్రిషా కృష్ణ‌న్, న‌య‌న‌తార‌. ఈ ఇద్ద‌రూ మంచి స్నేహితురాళ్లుగా ఉన్నారు. ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా…

    వీధి కుక్క‌ల‌ను చంపాల‌ని అనుకోవ‌డం నేరం

    Spread the love

    Spread the loveభావోద్వేగానికి గురైన న‌టి రేణు దేశాయ్ హైద‌రాబాద్ : న‌టి రేణు దేశాయ్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఆమె వీధి కుక్క‌ల‌కు సంబంధించి సీరియ‌స్ గా స్పందించారు. త‌మ త‌మ ప‌రిస‌రాల్లో వీధి కుక్క‌ల గురించి తెలిస్తే సంబంధిత…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *