newsseals.com
ENTERTAINMENT

జ‌క్క‌న్న‌, ప్రిన్స్ గ్లోబ్ ట్రాట‌ర్ టీజ‌ర్ లాంచ్

VijayaBhaskar November 11, 2025
newsseals-GlobeTrotter
Spread the love

15వ తేదీన రామోజీ ఫిలిం స్టూడియోలో

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. మంగ‌ళ‌వారం తాను తీస్తున్న గ్లోబ్ ట్రాట‌ర్ మూవీ గురించి కీల‌క అప్ డేట్ ఇచ్చాడు. హైద‌రాబాద్ లోని రామోజీ ఫిలిం స్టూడియంలో ఈనెల 15న శ‌నివారం రాత్రి సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ తో పాటు టీజ‌ర్ ను కూడా లాంచ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. దీంతో పెద్ద ఎత్తున ఈ మూవీపై అంచ‌నాలు మ‌రింత పెరిగేలా చేశాయి. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం పెట్టిన పెట్టుబ‌డి వ‌చ్చేసింద‌ని టాక్ కొన‌సాగుతోంది. ప్ర‌చారం చేయడంలో, దానిని ప్ర‌మోట్ చేయ‌డంలో ఎస్ఎస్ రాజ‌మౌళి త‌ర్వాతే ఎవ‌రైనా. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. విస్తు పోయేలా చేశాయి. ప్ర‌ధానంగా ఇందులో న‌టించిన మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా ఫోటోలు కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.

ఇక భార‌తీయ దిగ్గ‌జ సంస్థ జియో హాట్ స్టార్ రాత్రి 7 గంట‌ల నుంచి ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ కార్య‌క్ర‌మానికి దాదాపు 50 వేల మందికి పైగా హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి ప‌ర్మిష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు కూడా చేసుకున్న‌ట్లు తెలిపారు నిర్వాహ‌కులు. మొట్టమొదటి డిజిటల్ లాంచ్‌లో, ఈ ఈవెంట్ అద్భుతమైన ప్రదర్శనలతో సినిమా టీజర్ ప్రపంచ వ్యాప్తంగా అరంగేట్రంతో మరపురాని సినిమాటిక్ వేడుకను హామీ ఇస్తుంది. ఇక టీజర్, ఫస్ట్ లుక్ 130 అడుగుల x 100 అడుగుల భారీ స్క్రీన్‌పై ఆవిష్కరించనున్న‌ట్లు టాక్. భార‌త దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి స్క్రీన్ ను ఏర్పాటు చేయ‌లేదు. మ‌హేష్ బాబు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.