తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం
హైదరాబాద్ : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అనలాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రపంచంలో మోస్ట్ పవర్ ఫుల్ దార్శనిక సాంకేతిక నిపుణుడిగా తను గుర్తింపు పొందారు. మైక్రోసాఫ్ట్ కినెక్ట్ , హోలోలెన్స్‌లను సృష్టించడంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కిప్‌మాన్ మానవ-కంప్యూటర్ పరస్పర చర్యను పునర్నిర్వచించడంలో మార్గ దర్శకుడిగా గుర్తింపు పొందాడు. తెలంగాణ ఫ్యూచర్ సిటీ, AI సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులలో తదుపరి తరం ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏకీకృతం చేయడానికి సంభావ్య సహకారాల గురించి సీఎం చర్చించారు అలెక్స్ కిప్ మాన్ తో.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, పట్టణ వరదలు, వాతావరణ మార్పుల అంచనాను వారి అత్యాధునిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పరిష్కరించడంలో అనలాగ్ AI ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈసందర్భంగా సీఎం కీలక సూచన చేశారు తనతో. తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చే డిసెంబర్ 8,9వ తేదీలలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కంపెనీల సీఈఓలు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు , కన్సల్టెంట్స్ హాజరవుతున్నారని, మీరు కూడా రావాలని అలెక్స్ కిప్ మాన్ ను ఆహ్వానించారు.





