ఆర్టీసీ బ‌స్సులో నారా భువ‌నేశ్వ‌రి ప్ర‌యాణం

అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచిన సీఎం స‌తీమ‌ణి

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు భార్య నారా భువ‌నేశ్వ‌రి చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన జ‌ల‌హార‌తి కార్య‌క్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమ‌మే కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. వ్యవ‌సాయం దండుగ కాదు పండుగ అని పేర్కొన్నారు. సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర అభివృద్ది కోసం రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తున్నార‌ని, రోజుకు 18 గంట‌ల‌కు పైగా క‌ష్ట ప‌డుతున్నార‌ని తెలిపారు.

ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా మ‌హిళ‌ల‌ కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొంది, శాంతిపురం నివాసం నుంచి తుమ్మిసి వరకూ బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. వారంతా కూట‌మి స‌ర్కార్ కు, ప్ర‌ధానంగా సీఎం చంద్ర‌బాబు నాయుడుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. దీని వ‌ల్ల త‌మ‌కు ఇబ్బందులు త‌ప్పాయ‌న్నారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *