అందెశ్రీ‌కి మ‌ర‌ణం లేదు : రేవంత్ రెడ్డి

Spread the love

తెలంగాణ అస్తిత్వానికి ఆయ‌న ద‌ర్ప‌ణం

హైద‌రాబాద్ : క‌వి, గాయ‌కుడు అందెశ్రీ‌కి మ‌ర‌ణం లేద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్షర వాహినితో “నిప్పుల వాగు”ను పారించి, మాయమై పోతున్న మనిషిని మనిషికి తిరిగి పరిచయం చేసి, తెలంగాణ అస్థిత్వ పోరులో ఊరూరా “జయ జయహే తెలంగాణ” గళమై వినిపించి , అణిచి వేతపై, నియంతృత్వ పాలనపై నిరసన గళాన్ని ఎక్కు పెట్టిన చివరి ఊపిరి వరకు అండగా నిలిచిన నా ఆప్తుడు అందెశ్రీ లేక పోవ‌డం బాధ‌గా ఉంద‌న్నారు. రవీంధ్ర భారతిలో తెలంగాణ సకల జన సహజ కవి సంస్మరణ సభలో ఆయనకు నివాళి అర్పించారు సీఎం.

బాధతో ఉద్వేగంతో ఈ మాట చెబుతున్నా. ఉద్యమంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ… స్వరాష్ట్రం సాకారమైన తర్వాత ఆ గీతం రాష్ట్రీయ గీతంగా అధికారిక హోదా లభిస్తుందని 4 కోట్ల ప్రజలు ఆశించారు. తెలంగాణ ఉద్యమం ఎవరు చేశారంటే అందెశ్రీ, గద్దర్, గోరటి వెంకన్న, ఒక జయరాజ్ చేశారన్న చర్చ వస్తుందని గత పాలకుల హయాంలో ఆ గీతం మూగ బోయింద‌న్నారు. పెన్నే కదా అని మన్నుకప్పితే గన్నులై మొలకెత్తుతాయి.. గన్నులై గడీలే కుప్ప కూలుతయన్న నినాదాన్ని అందెశ్రీ నిజం చేశారని అన్నారు.

సమైక్య వాదులు ఈ తెలంగాణపై ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు వారి ఆధిపత్యానికి చెరమ గీతం పాడాల్సిందేనని, తెలంగాణకు విముక్తి కల్పించాల్సిందేనని మలి దశ ఉద్యమానికి పునాదులు వేశార‌ని చెప్పారు. రాచరికం హద్దు దాటినప్పుడు, తెలంగాణ నేలను చెరబట్టాలని, ఈ నేలపై ఆధిపత్యం చెలాయించాలని అనుకున్నప్పుడల్లా ఈ గడ్డపై పుట్టిన కవులు, కళాకారులు, తమ దుప్పటి దుమ్ము దులిపి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ నేలకు ఉంద‌న్నారు.

సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా, ఆలోచించకుండా 5 దశాబ్దాల పని చేసిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. గద్దర్, అందెశ్రీ, ఈ ప్రజా పాలన కోసం శాయశక్తులా పని చేశారని ప్ర‌శంసించారు. వారి పోరాట స్ఫూర్తిని మ‌రిచి పోలేమ‌న్నారు రేవంత్ రెడ్డి. అందెశ్రీ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వడంతో పాటు స్మతివనం కట్టాలనుకున్నాం. తాను రాసిన‌ నిప్పుల వాగు పుస్తకాన్ని ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంద‌ని ప్ర‌క‌టించారు సీఎం .

  • Related Posts

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు

    Spread the love

    Spread the loveస్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్ర‌భాక‌ర్ హైద‌రాబాద్ : మ‌రోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, క‌ళాకారులు, క‌వులు, అమ‌రవీరుల కుటుంబాలు, జ‌ర్న‌లిస్టులు సైతం భ‌గ్గుమంటున్నారు.…

    మ‌య‌న్మార్ అధ్య‌క్షుడితో పీఎం మోదీ భేటీ

    Spread the love

    Spread the loveప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్‌లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా భారత, మయన్మార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *