రేవంత్ రెడ్డితో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం భేటీ

ఇద్ద‌రి మ‌ధ్య కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు

హైద‌రాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో కలిసిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించారు . ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై మోహన్ యాదవ్ కి వివరించారు. అంతే కాకుండా దేశంలో ఎక్క‌డా లేని విధంగా, ఏ రాష్ట్రం అమ‌లు చేయ‌ని విధంగా తాము వ‌చ్చాక స‌న్న బియ్యాన్ని పేద‌ల‌కు పంపిణీ చేస్తున్నామ‌న్నారు.

ఇదే స‌మ‌యంలో తాజాగా రాష్ట్రంలో ప‌ర్య‌టించిన కేంద్ర ఆహార , పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి సైతం తాము అమ‌లు చేస్తున్న స‌న్న బియ్యం ప‌థ‌కాన్ని ప్ర‌శంసించార‌ని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప‌థ‌కాన్ని దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల‌లో అమ‌లు చేయాల‌ని తాము సూచించామ‌ని, ఇందుకు ఆయ‌న స‌మ్మ‌తించార‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే అధికారికంగా ఢిల్లీలో స‌మావేశం కూడా ఏర్పాటు చేస్తామ‌న్నార‌ని చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంతో క‌ల‌వ‌డం మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు రేవంత్ రెడ్డి.

  • Related Posts

    డేటా సెంటర్ల విషయంలో అపోహలు వద్దు

    విశాఖ‌పట్నం జిల్లా : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నానికి ఎంతో చేయాల్సిన బాధ్యత మనపై ఉంద‌న్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ దేశంలోనే తొలి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకనామిక్ రీజియన్‌గా…

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *