హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదుల వెల్లువ‌

Spread the love

క‌బ్జాదారుల భ‌రతం ప‌డ‌తామ‌న్న క‌మిష‌న‌ర్

హైద‌రాబాద్ : క‌బ్జాదారులు, ప్ర‌భుత్వ స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 64 ఫిర్యాదులు అందిన‌ట్లు తెలిపారు క‌మిష‌న‌ర్. ఇదిలా ఉండ‌గా మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల రామారంలోని వోక్షిత్ హిల్ వ్యూ కాల‌నీ 7 ఎక‌రాల ప‌రిధిలో ఉంది. దాదాపు 200ల కుటుంబాలు ఇక్క‌డ నివాసం ఉంటున్నాయి. పైన అట‌వీ ప్రాంతం నుంచి వ‌చ్చిన వ‌ర‌ద గ‌తంలో సాఫీగా బంధం చెరువుకు వెళ్తుండేది. బంధం చెరువుకు.. వోక్షిత్ హిల్‌వ్యూ కాల‌నీకి మ‌ధ్య ఓ నిర్మాణ సంస్థ‌.. ఇప్పుడు అపార్టుమెంట్లు క‌ట్ట‌డంతో ఈ వ‌ర‌ద కాలువ త‌మ భూమిలోంచి వెళ్ల‌డానికి వీలు లేద‌ని ఏకంగా మూసేశార‌ని.. గ‌తంలో మున్సిపాలిటీవాళ్లు వేసిన పైపులైన్ల‌ను ధ్వంసం చేశారంటూ వాపోయారు బాధితులు. దీంతో మురుగు, వ‌ర‌ద నీరు నిలిచిపోయి త‌మ కాల‌నీవాళ్లం ఇబ్బంది ప‌డుతున్నామ‌ని వోక్షిత్ హిల్ వ్యూ కాల‌నీ ప్ర‌తినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌లం బీఎన్‌రెడ్డి న‌గ‌ర్ డివిజ‌న్‌లోని కాప్రాయి చెరువు అలుగులు మూసేయ‌డంతో చెరువు నిండి ఎగువున ఉన్న తాము చాలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని హ‌రిహ‌ర‌పురం కాల‌నీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ చెరువు నిండి కింద‌న ఉన్న బాతుల చెరువుకు నీరు వెళ్లేద‌ని.. ఇక్క‌డ అలుగు ముసేయ‌డం, తూములు బంద్‌చేయ‌డంతో చెరువు కింద ఉన్న కాల‌నీల వారు కూడా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా 20 కాల‌నీల వారు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. వెంట‌నే స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

పెద్ద అంబ‌ర్‌పేట మున్సిపాలిటీ ప‌శుమాముల విలేజ్ స‌ర్వే నంబ‌రు 454లో 9 ఎక‌రాల ప‌రిధిలో దాదాపు 155 ప్లాట్ల‌తో 1982లో లే ఔట్ వేశారు. దీనికి ఆనుకుని ఉన్న 455 స‌ర్వే నంబ‌రులో 1.06 ఎక‌రాల భూమి ఉన్న వ్య‌క్తి త‌మ లే ఔట్‌లోకి వ‌చ్చి ర‌హ‌దారులు క‌బ్జాచేసేసి.. కొన్నిప్లాట్ల‌ను కూడా క‌లిపేసుకున్నార‌ని ఆ లే ఔట్‌లోని ప్లాట్ ఓన‌ర్ల సంఘం ప్ర‌తినిధులు వ‌చ్చి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండ‌లం వెంక‌టాపురం బ్యాంక్ కాల‌నీ లో 372 గ‌జాల ఓపెన్ బావి ఉండేది. దీనిని మ‌ట్టితో నింపి ప్ర‌జావ‌స‌రాల‌కు కాల‌నీవాసులు వినియోగించుకునేవారు. అయితే ఇటీవ‌ల ఈ స్థ‌లం మాది అంటూ త‌ప్పుడు ప‌త్రాల‌తో రిజిస్ట్రేష‌న్ చేయించుకుని కొట్టేయాల‌ని ఓ వ్య‌క్తి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ స్థ‌లానికి జీహెచ్ ఎంసీ వాళ్లు వేసిన ఫెన్సింగ్‌ను కూడా తొల‌గించి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ్డారంటూ వాపోయారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్టుగేజ్‌లో ఉందంటూ బోర్డు పెట్టార‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    Spread the love

    Spread the loveప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగ‌డుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్త‌లు రాస్తూ వ‌స్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను సింగ‌రేణి…

    కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveపాలేరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి షాకింగ్ కామెంట్స్ ఖ‌మ్మం జిల్లా : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *