రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు : ఎస్. స‌విత‌

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన జౌలి శాఖ మంత్రి
అమ‌రావ‌తి : వ‌చ్చే ఏడాది సంక్రాంతి పండుగ వ‌ర‌కు చేనేత వ‌స్త్రాల‌పై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర ఔళి, చేనేత , బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని చిన్నారులతో పాటు ఆయా వయస్సుల వారికి అవసరమైన రెడీ మేడ్ చేనేత వస్త్రాలను ఆప్కో షో రూమ్ ల్లో విక్రయిస్తున్నామని వెల్ల‌డించారు. దీంతో చేనేత వస్త్రాల కొనుగోలు పెరిగినట్లు మంత్రి సవిత తెలిపారు.

చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చేనేత బజార్లు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలో విశాఖ, కర్నూలు, కడప వంటి నగరాలతో పాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు, బజార్లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా త‌మ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు.

  • Related Posts

    చెట్టినాడు సిమెంట్స్ ప‌న్నుల ఎగ‌వేత

    Spread the love

    Spread the loveచ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించిన ప‌వ‌న్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప‌రిశ్ర‌మ‌లు వెద‌జ‌ల్లుతున్న కాలుష్యంపై మండిప‌డ్డారు. మ‌రో వైపు ఆయా గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలోని కంపెనీలు…

    పంచాయతీలకు రూ. 160 కోట్ల పన్ను బకాయిలు

    Spread the love

    Spread the loveవెల్ల‌డించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల అమ‌రావ‌తి : గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకి డబ్బులు లేవని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకే రూ. 88 కోట్ల అవసరం ఉంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *