బీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంది

కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కామెంట్స్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయ‌కురాలు, కార్పొరేట‌ర్ మ‌న్నె క‌వితా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెట్టింపు వేగంతో కారు పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు . స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే గ్రామాల్లో ఇందిరమ్మ చీరలు పంచుతున్నారని కాంగ్రెస్ స‌ర్కార్ పై ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ చీరలు పంచడం లేదని మండిప‌డ్డారు. కేటీఆర్ పెట్టిన భయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక్కో పోలింగ్ బూత్ లో ఒక్కో మంత్రితో రేవంత్ రెడ్డి ప్రచారం చేయించుకున్నాడని ఎద్దేవా చేశారు మ‌న్నె క‌వితా రెడ్డి. ఎన్ని కుట్రలు చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచారో రాష్ట్రమంతా చూశారని అన్నారు.

ఎన్నిక‌ల్లో అడ్డ‌గోలు హామీలు ఇచ్చి ఇప్పుడుచేతులెత్తేసింది మీరు కాదా అని ప్ర‌శ్నించారు మ‌న్నె క‌వితా రెడ్డి. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, క‌ర్ర కాల్చి వాత పెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. ఇప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే వ‌చ్చేది గులాబీ ప్ర‌భుత్వ‌మేన‌ని అన్నారు. ప‌దే ప‌దే కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసు కోవ‌డం త‌ప్పా ఆయ‌న చేసింది ఏమీ లేద‌న్నారు . ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, అవినీతి, అక్రమాల‌కు పాల‌న కేరాఫ్ గా మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మ‌న్నె క‌వితా రెడ్డి.

  • Related Posts

    మెట్టూరు ఆన‌క‌ట్ట నుండి నీటిని విడుద‌ల చేసిన సీఎం

    చెన్నై : తమిళనాడు ముఖ్య‌మంత్రి తిరు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ మంగ‌ళవారం కావేరి డెల్టా జిల్లాలో ప‌ర్య‌టించారు. ‘వరి గిన్నె’గా ప్రసిద్ధి చెందిన కావేరీ డెల్టా జిల్లాల్లో ‘సాంబా’ పంట సాగుకు, కావేరీ పరీవాహక ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి సేలం…

    రేపు విద్యుత్ వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్

    తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ‌శంక‌ర్ లోతేటి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సెప్టెంబర్ 2వ తేదీన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *