రైతుల కోసం విత్త‌నాల పంపిణీ కార్య‌క్రమం

ప్రారంభించిన మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు

హైద‌రాబాద్ : రైతుల కోసం విత్త‌నాల పంపిణీ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు. ఇవాళ జ‌రిగిన‌ ‘రైతునేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కేంద్రం తీసుకొచ్చిన “విత్తన బిల్లు 2025” ముసాయిదాను రైతులకు క్లుప్తంగా వివరించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి రాత పూర్వకంగా అభిప్రాయాలు సేకరించి, ప్రభుత్వానికి సమర్పించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రత మిషన్ (NFSM) పథకం ద్వారా వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. జాతీయ ఆహార భద్రత మిషన్ (NFSM) పథకంలో భాగంగా 5500 క్వింటాళ్ల వరి విత్తనాలను 16 జిల్లాల్లోని రైతులకు 50 శాతం సబ్సిడీపై అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆయిల్ పామ్ పంటల్లో అంతర పంటల సాగు ఆవశ్యకత గురించి, వరి పంట కోత అనంతరం వరి కొయ్యలను కాల్చకుండా భూమిలో దున్ని పర్యావరణాన్ని సంరక్షించాల్సిన అవసరం గురించి రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. పంట అవశేషాలను కాల్చడం వలన కలిగే దుష్పరిణామాలను గ్రామ గ్రామాన తిరిగి అధికారులు విస్తృత అవగాహన కల్పించాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పంట అవశేషాల లేదా వ్యర్థాల నిర్వహణపై ఒక లఘు చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమీషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ బి. అన్వేష్ రెడ్డి, రైతు సంక్షేమ కమీషన్ సభ్యులు సునీల్, ఇల్లందు-కొత్తగూడెం శాసనసభ్యులు కోరం కనకయ్య, వ్యవసాయ సంచాలకులు డా. బి. గోపి, రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు , అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *