వరంగల్‌కు ‘టెక్స్‌టైల్ హబ్’ తో పూర్వ వైభవం

మెగా టెక్స్‌టైల్ పార్క్ సందర్శించిన కేటీఆర్

వ‌రంగ‌ల్ జిల్లా : వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను (KMTP) సందర్శించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ప్రస్తుత పరిస్థితి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనంగా చెప్పవచ్చు అన్నారు. ఒకనాడు వరంగల్ జిల్లా, ఓరుగల్లు జిల్లా అంటేనే అజంజాహీ మిల్లుకు, ఇక్కడ పండే బ్రహ్మాండమైన పత్తికి ఆలంబనగా నిలిచి, చుట్టుపక్కల జిల్లాల నేతన్నలకు ఉపాధి కల్పించిన ప్రాంతం అని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లా తన పూర్వ వైభవాన్ని కోల్పోయి, నేతన్నలు సూరత్, షోలాపూర్, బివాండి వంటి ప్రాంతాలకు వలసపోయే దుస్థితి ఏర్పడిందన్నారు.

ఈ పరిస్థితిని మార్చి, వరంగల్‌ను ఒక సూరత్ లాగా, తమిళనాడులోని తిరుపూర్ లాగా టెక్స్‌టైల్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో ‘ఫామ్ టు ఫ్యాషన్’ –అంటే నల్లరేగడి నేలల్లో పండే తెల్ల బంగారం (పత్తి) తో రైతుకు, పరిశ్రమలో పనిచేసే మహిళలకు ఉపాధి దొరకాలనే సంకల్పంతో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింద‌న్నారు. సరిగ్గా ఎనిమిది ఏళ్ల కిందట, 2017 అక్టోబర్ 22 నాడు కేసీఆర్ ఇదే ప్రాంగణంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారని చెప్పారు కేటీఆర్. మధ్యలో కరోనా కారణంగా రెండేళ్లు ఇబ్బంది కలిగినా, ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కైటెక్స్, యంగ్‌వన్, గణేషా లాంటి పరిశ్రమలు దాదాపు 25-30 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *