ప్ర‌త్యేకంగా ట్రిబ్యూన‌ల్ ఏర్పాటు చేస్తాం

Spread the love

ప్ర‌క‌టించిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర రెవెన్యూ, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న భూ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. ఇందులో భాగంగా ప్ర‌త్యేకంగా ట్రిబ్యున‌ల్స్‌ను ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు. అదే విధంగా గ‌త ప్ర‌భుత్వ హ‌యాం నుంచి చోటు చేసుకున్న అక్ర‌మాల‌ను వెలికి తీసేందుకు గాను చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. ఇంత వర‌కు రెండు జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జ‌రుగుతోంద‌ని చెప్పారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. వాటి ఫలితాల‌ను గ‌మ‌నించి, రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేసి అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.

గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో లెక్క‌లేనంత‌గా భూ అక్ర‌మాలు చోటు చేసుకున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చాయ‌న్నారు. అందుకే విచార‌ణ‌కు ఆదేశించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. కొత్త‌గా భూ య‌జ‌మానుల‌కు వీలుగా , మేలు జ‌రిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ప్ర‌త్యేకంగా యాప్ ను త‌యారు చేయిస్తున్నామ‌ని చెప్పారు. ఈ కీల‌క‌ స‌మావేశంలో రెవెన్యూ కార్య‌ద‌ర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ కార్య‌ద‌ర్శి రాజీవ్ గాంధీ హ‌నుమంతు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    త‌ప్పుకున్న మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్

    Spread the love

    Spread the loveఅశోక్ ఖాత‌ర్ సెక్స్ స్కాం కేసులో త‌న పేరు ముంబై : మ‌హారాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్, ఎన్సీపీకి చెందిన నాయ‌కురాలు రూపాలీ చ‌కాన్క‌ర్ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. అనూహ్యంగా ఆమె తాజాగా సంచ‌ల‌నం సృష్టించిన…

    మాట నిల‌బెట్టుకుంటా ఇళ్ల స్థ‌లాలు ఇస్తా

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల‌కు తీపి క‌బురు చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అసెంబ్లీ స‌మావేశాల అనంత‌రం సీఎం చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *