జగన్ కూలిస్తే మేం నిర్మిస్తున్నాం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత‌

పెనుకొండ‌, స‌త్య‌సాయి జిల్లా : జ‌గ‌న్ రెడ్డి కూలిస్తే తాము నిర్మిస్తున్నామ‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి స‌విత‌. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీవో కార్యాలయాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. డివిజన్ స్థాయిలో ఉన్న అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు. డీడీవో కార్యాలయాను మినీ కలెక్టరేట్లుగా రూపొందిస్తోందని తెలిపారు. ఇలా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండడం వల్ల పాలనా సౌలభ్యం క‌లుగుతుంద‌న్నారు. ప్రజా సమస్యలకు కూడా తక్షణ పరిష్కారాలు లభిస్తాయన్నారు మంత్రి స‌విత‌. 2014-19 మధ్య రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఆనాడు గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కాలువలు నిర్మించామన్నారు. గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులతో వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు. మరోసారి కూటమి ప్రభుత్వం రావడంతో, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు కేంద్ర నుంచి నిధులు తీసుకు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను జగన్ కూలిస్తే పాలన సౌలభ్యం, ప్రజా సమస్యల పరిష్కారాల కోసం నూతన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, డీడీవో రామకృష్ణయ్య, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *