కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : విద్య ఒక్కటే జీవితంలో పైకి ఎదిగేందుకు దోహద పడుతుందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా లోని భామిని మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులతో ముచ్చటించారు సీఎం. విద్యార్ధులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా విద్యార్థినులను ప్రశంసించారు. లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్ధుల సామర్ధ్యాలను స్వయంగా పరీక్షించడం విశేషం. ఎలా నేర్చుకోవాలో వారికి వివరించారు.
విద్యా శాఖలో అమలు చేస్తున్న వివిధ సంస్కరణల్ని ముఖ్యమంత్రికి వివరించారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. మెరుగైన వసతి సౌకర్యాలను కూటమి ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏమిటంటే నాణ్యమైన విద్య మాత్రమేనని, దీనిని గుర్తించాలని పేరెంట్స్ కు హితవు పలికారు. గత సర్కార్ విద్యా రంగాన్ని పట్టించు కోలేదని, కానీ తాము పవర్ లోకి వచ్చాక కీలకమైన మార్పులు తీసుకు వచ్చామన్నారు. అంతే కాకుండా ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేశామన్నారు.






