హోమ్‌స్టే‌ల అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు

కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షేకావ‌త్ వెల్ల‌డి

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా “గిరిజన ప్రాంతాల్లో హోమ్‌స్టే‌ల అభివృద్ధి” ప‌థ‌కం కింద 17 రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి హోమ్‌స్టే‌ల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు అందాయ‌న్నారు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షేకావ‌త్ . వాటిలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్ , లడఖ్ నుంచి వచ్చిన మొత్తం 5 ప్రతిపాదనలకు రూ.17.52 కోట్ల వ్యయంతో ఆమోదం ల‌భించిన‌ప్ప‌టికి నిధులు మాత్రం విడుద‌ల కాలేద‌ని వెల్ల‌డించారు. లోక్ స‌భ‌లో సోమ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ హోమ్‌స్టే‌ల అభివృద్ధి పై కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిత్వ శాఖ‌ను ప్ర‌శ్నించ‌గా, ఆ శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షేకావ‌త్ లిఖిత పూర్వ‌కంగా బ‌దులిచ్చారు.

2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రధానమంత్రి జన జాతీయ ఉన్మత్త గ్రామ అభియాన్ (PM-JUGA) కింద, స్వదేశ్ దర్శన్ పథకానికి అనుబంద ప‌థ‌కంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అవకాశాలను పెంపొందించి, గిరిజన కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ “గిరిజన ప్రాంతాల్లో హోమ్‌స్టే‌ల అభివృద్ధి” పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ పథకం కింద గ్రామ సముదాయ అవసరాలకు రూ.5 లక్షల వరకు, ప‌త్రి కుటుంబానికి రెండు కొత్త గదుల నిర్మాణానికి రూ.5 లక్షల వరకు, గదుల పునరుద్ధరణకు రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించటం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఈ పథకం కింద ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి కూడా నిధులు విడుదల కాలేదని, అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయిలో గానీ, జిల్లా స్థాయిలో గానీ నిధుల వినియోగం జరగలేదన్నారు. జిల్లా వారీగా హోమ్‌స్టే‌ల సంఖ్య లేదా నిధుల కేటాయింపు వివరాలు ఇంకా ప్రకటించలేదని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *