మారిన స్వ‌రం చంద్ర‌బాబు జ‌పం

సీఎంను ఆహ్వానించిన కోమ‌టిరెడ్డి

అమరావ‌తి : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్వ‌రం మార్చారు. ఆయ‌న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న గొప్ప నాయ‌కుడ‌ని, ముందు చూపు క‌లిగిన వ్య‌క్తి అని అన్నారు. అంతే కాదు స్వ‌రం పూర్తిగా మార్చేశారు. ఏమైందో ఏమో కానీ నిన్న‌టి దాకా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏకి పారేసిన కోమ‌టిరెడ్డి ఉన్న‌ట్టుండి యూ ట‌ర్న్ తీసుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. త‌మ ప్ర‌భుత్వం ఈనెల 8,9వ తేదీల‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ 2025ను నిర్వ‌హిస్తోంది. ఈ సంద‌ర్బంగా అమ‌రావ‌తిలోని క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును క‌లిశారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

ఆనాడు జ‌గ‌న్ రెడ్డి అక్ర‌మంగా చంద్ర‌బాబును అరెస్ట్ చేస్తే ఏ ఒక్క‌రు అడ్డుకోలేద‌న్నారు. కానీ తెలంగాణ‌లో ఆయ‌న అరెస్ట్ ను ఖండించాన‌ని, అంతే కాకుండా టీడీపీ శ్రేణుల‌ను అడ్డుకోవ‌ద్దంటూ అప్ప‌టి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాన‌న్నారు. ఇవాళ నారా చంద్ర‌బాబు నాయుడు నుంచి తాను ఎన్నో నేర్చుకున్నాన‌ని చెప్పారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఆయ‌న‌ను ప్ర‌తి ఒక్క నాయ‌కుడు ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్బంగా స‌మ్మిట్ కు ప్ర‌త్యేకంగా రావాల‌ని ఆహ్వానించ‌డం జ‌రిగిందని చెప్పారు త‌న‌ను క‌లిసిన అనంత‌రం మీడియాతో.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *