NEWSANDHRA PRADESH

టీడీపీని వ‌దిలి పెట్ట‌ను – గ‌ల్లా

Share it with your family & friends

ఏ పార్టీలో చేరే ప్ర‌స‌క్తి లేదు

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాను పార్టీ మారుతున్నాన‌ని వస్తున్న ప్ర‌చారం అంతా త‌ప్ప‌ని పేర్కొన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆరు నూరైనా, ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా టీడీపీతోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

రాజీనామా చేసే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. అయితే ప్ర‌స్తుతానికి రాజ‌కీయాలకు దూరంగా ఉంటున్నాన‌ని అన్నారు. తిరిగి పుల్ టైమ్ పాలిటిక్స్ చేసేందుకు తిరిగి వ‌స్తాన‌ని చెప్పారు గ‌ల్లా జ‌య‌దేవ్. గుంటూరు జిల్లాలో త‌న‌కు గ్రూప్ రాజ‌కీయాలు లేవ‌న్నారు.

అయితే రాష్ట్ర ప్రయోజ‌నాల కోసం పార్ల‌మెంట్ లో త‌న గ‌ళాన్ని వినిపిస్తాన‌ని అన్నారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇండియా చిత్ర ప‌టంలో అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధాని సిటీగా పెట్టించాన‌ని తెలిపారు. ఇంత‌క‌న్నా ఒక ఎంపీగా ఇంక ఏం చేయాలో చెప్పాల‌న్నారు.