జ‌నం మెచ్చిన నేత గుమ్మ‌డి న‌ర్స‌య్య‌

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎక్క‌డా ఇసుమంత గ‌ర్వం అన్న‌ది లేని నాయ‌కుడు గుమ్మ‌డి న‌ర్స‌య్య అంటూ కితాబు ఇచ్చారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివాసి ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. మనందరికీ ఆదర్శప్రాయుడు, ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి కూడా సాధారణ జీవితం గడిపిన, గడుపుతున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు క‌విత‌.

త‌న జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు . వారి చరిత్ర మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారత దేశంలో సినిమాగా రావటం తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వ కార‌ణం అన్నారు క‌విత‌.. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాల‌ని, ప్రేక్షకుల ఆదరణ పొందాలని, రాజకీయాల్లోకి రావాలనుకునే నేటి యువతకు స్ఫూర్తి నివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

  • Related Posts

    వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా

    హైద‌రాబాద్ : అంద‌రూ అనుకున్న‌ట్లే విక్ట‌రీ వెంక‌టేష్ కీ రోల్ పోషించిన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆద‌ర్శ కుటుంబం వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా సోమ‌వారం ప్ర‌క‌టించారు నిర్మాత నాగ‌వంశీ. వాస్తవానికి అక్టోబ‌ర్ 9వ తేదీన…

    ర‌ష్మిక మంద‌న్నా..దేవుడిచ్చిన వ‌రం : దేవ‌ర‌కొండ

    హైద‌రాబాద్ : యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను త‌న భార్య‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాతో క‌లిసి రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చారిత్రాత్మ‌క‌మైన ర‌ణ‌బాలి మూవీలో క‌లిసి న‌టిస్తున్నారు. గ‌తంలో ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఇద్ద‌రూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *