ర‌ష్మిక మంద‌న్నా..దేవుడిచ్చిన వ‌రం : దేవ‌ర‌కొండ

హైద‌రాబాద్ : యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను త‌న భార్య‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాతో క‌లిసి రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చారిత్రాత్మ‌క‌మైన ర‌ణ‌బాలి మూవీలో క‌లిసి న‌టిస్తున్నారు. గ‌తంలో ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఇద్ద‌రూ క‌లిసి గీత గోవిందం లో న‌టించారు. ఆ స‌మ‌యంలోనే ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఆ త‌ర్వాత ఒక్క‌ట‌య్యారు. పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధం త‌ర్వాత క‌లిసి తొలిసారిగా న‌టిస్తున్న మూవీ ర‌ణ‌బాలి కావ‌డం తో అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు అక్టోబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ర‌ణ‌బాలి మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ మీడియా ఛాన‌ల్ తో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నాడు న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తనతో పోటీ పడగలిగే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరని అన్నాడు. రష్మిక మందన్నా తన జీవిత భాగస్వామి కావడంపై తాజాగా చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గ‌తంలో విజ‌య‌వంత‌మైన‌ “ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్” చిత్రాల దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శక‌త్వం వ‌హించ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మొత్తంగా త‌న‌కు ర‌ష్మిక మంద‌న్నా స‌తీమ‌ణి కావ‌డం దేవుడు ఇచ్చిన వ‌రం అని పేర్కొన్నాడు.

  • Related Posts

    మార్ఫింగ్ వీడియోపై జూనియ‌ర్ ఎన్టీఆర్ సీరియ‌స్

    హైద‌రాబాద్ : టాలీవుడ్ స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు సంబంధించి మార్ఫింగ్ వీడియోలు త‌యారు చేసినా లేదా షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మార్ఫింగ్ వీడియోపై…

    బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న డైరెక్ట‌ర్ చందూ మొండేటి

    హైద‌రాబాద్ : దర్శకుడు చందూ మొండేటి అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటిలతో కలిసి ఒక లఘు చిత్రంతో బాలీవుడ్ దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంజయ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *