ప్రకటించిన భారతీయ జనతా పార్టీ చీఫ్ మాధవ్
అమరావతి : ఈనెల 11న అటల్ బిహారి వాజ్ పేయ్ సందేశ్ మోదీ పారదర్శక పాలన యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యుడు పీవీఎన్ మాధవ్. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీకి చెందిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా యాత్రకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇదే సమయంలో కీలక ప్రకటన చేశారు పీవీఎన్ మాధవ్.
ఇదిలా ఉండగా ఈనెల 25న అమరావతిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ విశేష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, బీజేపీ పార్టీ చీఫ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని ప్రకటించారు. డిసెంబర్ నెలలో 11 నుంచి 25 వరకు బస్సు యాత్ర జరుగుతుందని స్పష్టం చేశారు. 11న ప్రారంభమై 25న బీజేపీ సభతో ముగుస్తుందని చెప్పారు బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్.






