వారం రోజుల్లో సీఏఏ అమలు
శంతను ఠాకూర్ కామెంట్స్
కోల్ కతా – కేంద్రంలోని బీజేపీ సర్కార్ దూకుడు పెంచింది. ఎలాగైనా టార్గెట్ 400 అనే నినాదంతో ముందుకు వెళుతోంది. ప్రధానంగా ఉమ్మడి పౌర సత్వం అనే దానిపై ఫోకస్ పెట్టింది. దేశ వ్యాప్తంగా ఏక పౌరసత్వం మాత్రమే ఉండాలనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఒకే దేశం , ఒకే పార్టీ, ఒకే కులం, ఒకే మతం అన్నది భారతీయ జనతా పార్టీ నినాదం. ఇది పూర్తిగా సెక్యులరిజానికి విరుద్దం.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. పోరాటాలు కొనసాగాయి. తాము ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ విపక్షాలు ప్రకటించాయి. దీనిపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి పౌర సత్వంకు సంబంధించి బీజేపీ ఎంపీ , కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ సంచలన ప్రకటన చేశారు.
లోక్ సభ ఎన్నికల కంటే ముందే తాము సీఏఏ తీసుకు వస్తామని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా తాము బిల్లును తీసుకు వచ్చి తీరుతామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. దీని అమలుకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించడం జరిగిందన్నారు. ఆన్ లైన్ లో పోర్టల్ కూడా అందుబాటులో ఉందన్నారు.