బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించండి

Spread the love

పిలుపునిచ్చిన బీసీ జేఏసీ కో చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

హైద‌రాబాద్ : మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీసీలు ఐక్యమై సర్పంచ్ సీట్లను అత్యధికంగాగె లుచుకోవాలని పిలుపునిచ్చారు బిసి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ . బీసీలకు రాజకీయ అధికారం దక్కాలంటే ప్రస్తుతం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అన్నారు. బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో బీసీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక స్థానాలలో గెలిపించుకొని బీసీల రాజకీయ చైతన్యన్నీ చాటి చెప్పాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 5380 సర్పంచ్ స్థానాలు దక్కేవని అన్నారు. అలా కాకుండా జీవో నెంబర్ 46 ద్వారా బీసీ రిజర్వేషన్లను 17 శాతం కు తగ్గించి మోసం చేశార న్నారు, బీసీలకు రావలసిన 3,400 బీసీ రిజర్వు స్థానాలను జనరల్ స్థానాలుగా మార్చారని , దీంతో జనరల్ స్థానాలు అంటే అగ్రకులాలవే అని భ్రమలలో ఉండి అక్రమంగా కూడబెట్టిన డబ్బుతో బీసీల ఓట్లను తమ నోట్లతో కొనుగోలు చేసి బీసీ అభ్యర్థులని ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

గ్రామీణ ప్రాంతాలలో 90% నివసించేది బీసీ, ఎస్సీ , ఎస్టీ లేనని, 90 శాతం జనాభా ఉన్న బహుజనులు 9% ఉన్న అగ్రకులాలకు ఓటు వేయవద్దని, జనరల్ స్థానాలలో నిలబడిన బీసీ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు కూడా అండగా నిలబడి సహకరించాలని కోరారు.

  • Related Posts

    అమ్మాన్ లో ప్ర‌ధాని మోదీకి ఘ‌న స్వాగ‌తం

    Spread the love

    Spread the loveసంతోషంగా ఉందంటూ పేర్కొన్న పీఎం అమ్మాన్ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న త‌న అధికారిక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమ్మాన్ లో కాలు మోపారు. అక్క‌డ మోదీకి ఘ‌న స్వాగ‌తం…

    దాడుల‌కు పాల్ప‌డితే ఊరుకోం ఎదుర్కొంటాం

    Spread the love

    Spread the loveకాంగ్రెస్ శ్రేణుల‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ హైద‌రాబాద్ : స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్లుగా బీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున రెండో విడ‌త జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొందారు. దీంతో త‌ట్టుకోలేని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయ‌కులు దాడుల‌కు దిగ‌డం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *