డాక్యుమెంట్ 2047 తెలంగాణ బతుకు చిత్రం
హైదరాబాద్ : తెలంగాణ గ్లోబల్ విజన్ 2047 డాక్యుమెంట్ నాలుగున్నర కోట్ల ప్రజానీకాన్ని మార్చే బతుకు చిత్రంగా అభివర్ణించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా క్యూర్, ప్యూర్, రేర్ గా విభజించి ముందుకు సాగేలా పాలసీని తయారు చేయడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా దీనిని ఆవిష్కరించారు సీఎం.
CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ): 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ప్రాంతం. సేవల విస్తరణకు ప్రాధాన్యం. నెట్-జీరో సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రపంచ స్థాయి నాలెడ్జ్, ఆవిష్కరణల కేంద్రంగా ఉంటుంది.
PURE (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ): ఔటర్ రింగ్ రోడ్ (ORR) , 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) మధ్య ఉన్న జోన్. తయారీ రంగానికి కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్‌లు ఏర్పాటు
RARE (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ): ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) దాటి, రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతం. వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి .
ఈ దార్శనికతను సాధించడానికి 10 కీలక వ్యూహాలను డాక్యుమెంట్ ప్రస్తావించింది.
- 3-జోన్ల రాష్ట్రం: సమతుల్య అభివృద్ధికి CURE-PURE-RARE నమూనా.
- విచక్షణ నుండి విధానానికి: పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత. విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం.
- గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు: భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రై పోర్ట్, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రీజినల్ రింగ్ రోడ్. రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి ప్రాజెక్టులు.
- సమర్ధ పాలన: డిజిటల్ గవర్నమెంట్, T-ఫైబర్, SPEED వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం.
- నాలెడ్జ్ హబ్: ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం .
- సుస్థిర సంక్షేమం: మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అందరికీ సమాన అవకాశాలు.
- అభివృద్ధి నిధులు: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం.
- పర్యావరణం మరియు సుస్థిరత: వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం.
- సంస్కృతి: రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం.. ప్రోత్సహించడం.
- ప్రజల కోసం, ప్రజల చేత: పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలు రూపొందించడం.






