ఆ పేపర్లను లీక్ చేస్తే పేరొచ్చేది
బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో చిత్రమైన కేసు నాపై మోపారంటూ ఎద్దేవా చేశారు ఎంపీ.
హిందీ పేపర్ లీక్ చేశానంటూ తన మీద కేసు పెట్టడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మా పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు నవ్వుకుంటున్నారని అన్నారు. పోనీ మ్యాథ్స్ , సైన్స్ పేపర్ లీక్ చేసినా తనకు పెద్ద ఎత్తున పేరు వచ్చి ఉండేదన్నారు బండి సంజయ్ కుమార్.
కేసీఆర్ సర్కార్ ఆనాడు పోలీసులను ప్రోత్సహించిందని, ఒక రకంగా చెప్పాలంటే ఖాకీల రాజ్యాన్ని కొనసాగించిందని ఆరోపించారు. అందుకే ప్రజలు ఛీ కొట్టారని అన్నారు. ఇకనైనా పోలీసులు మారాలని, ముందు తనపై నమోదు చేసిన కేసును తిరిగి తీసుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.