కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కామెంట్స్
ఢిల్లీ: కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఇది యుడిఎఫ్, కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్న ఎన్నిక అని అన్నారు. ఇది మాకు పెద్ద విజయమని పేర్కొన్నారు. ఖచ్చితంగా, ట్రెండ్ చాలా స్పష్టంగా ఉందనన్నారు. తాము తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవ బోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే తిరువనంతపురం కార్పొరేషన్‌లో తాము మంచి ప్రదర్శన ఇచ్చామని చెప్పారు.
కానీ సమస్య ఏమిటంటే సీపీఎం అస్సలు బాగా రాణించలేదని పేర్కొన్నారు కేసీ వేణుగోపాల్. ఎందుకంటే భారీ ప్రభుత్వ వ్యతిరేక తరంగం ఉందన్నారు. ఈ రోజుల్లో వారి విధానాలు కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కార్యకర్తలు కొన్ని స్థానాల్లో బిజెపికి ఓటు వేశారని నేను భావిస్తున్నానని అన్నారు. అందుకే ఈ ఫలితం వచ్చింది. కానీ తామంతా దీనికి వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తిరువనంతపురం ఎంపీగా తమ పార్టీకి చెందిన శశి థరూర్ ఉన్నారు. ఆయన గురించి తాను ఎలాంటి కామెంట్స్ చేయాలని అనుకోవడం లేదన్నారు కేసీ వేణుగోపాల్. మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు తమకు మరింత బలాన్ని ఇచ్చేలా చేశాయన్నారు.






