ప్రకటించిన దర్శకుడు అనిల్ రావిపూడి
హైదరాబాద్ : దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన ప్రకటన చేశారు. తను దర్శకత్వం వహించిన మెగాస్టార్ చిరంజీవి, లవ్లీ బ్యూటీ నయనతార కలిసి నటించిన మన శంకర ప్రసాద్ గారు మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో అనిల్ రావిపూడి ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇందులో కీలకమైన పాత్రలో విక్టరీ వెంకటేశ్ కూడా నటిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని తెలిపారు. వచ్చే ఏడాది 2026 జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో మెగా అభిమానులకు తీపి కబురు చెప్పాడు. దీంతో తమ అభిమాన నటుడి మూవీ గురించి కీలక ప్రకటన చేయడంతో ఫ్యాన్స్ సంబురాలలో మునిగి పోయారు.
అత్యంత జనాదరణ కలిగిన దర్శకుడిగా పేరు పొందాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాలను తీసిన ఘనత తనకు ఉంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి , మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల మన శంకర ప్రసాద్ గారు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు ఈ మూవీని. భీమ్స్ సిసిలిరియో అందించిన సంగీతం , పాటలు కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. తను సంక్రాంతికి వస్తున్నాం మూవీకి కూడా మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఇప్పుడు చిరంజీవికి అందించిన పాటలు కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమాను పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు అనిల్ రావిపూడి. యాక్షన్ సన్నివేశాలను వెంకట్ మాస్టర్ చేస్తున్నాడు. నయన్ తో పాటు విటివి గణేష్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.








