అమిత్ షాపై నిప్పులు చెరిగిన ఎంకే స్టాలిన్
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే సంచలన కామెంట్స్ చేశారు. చెన్నై వేదికగా ఆయన డీఎంకే యువతను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. రాబోయే రోజులు మనకు అత్యంత ముఖ్యమైనవని అన్నారు. కేంద్రం గురించి, బీజేపీ, అన్నాడీఎంకే గురించి ఆలోచించాల్సిన పని లేదన్నారు. వారి కుట్రలు ఇక్కడ సాగవన్నారు. ప్రధానంగా స్టాలిన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై సీరియస్ అయ్యారు. ఆయన జిమ్మిక్కులు, కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ పని చేయవన్నారు. అంతే కాదు మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఇక్కడ బీజేపీ అధికారంలోకి రానే రాదన్నారు ఎంకే స్టాలిన్.
ఇది బీహార్ కాదు తమిళనాడులో మీ ఆటలు ఇక్కడ సాగవన్నారు. అమిత్ షాపై తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపుతోంది ఆయా పార్టీ వర్గాలలో. మీరు ప్రేమతో వస్తే తమిళనాడు ప్రజలు స్వాగతిస్తారు..అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గుర్తు పెట్టుకోండి ఇది బీహార్ కాదు తమిళనాడు..అమిత్ షా కాదు మొత్తం బీజేపీ నాయకులు వచ్చినా ఇక్కడ గెలవలేరన్నారు. మరో జన్మ ఎత్తినా ఇక్కడ కాలు మోపడం మీ తరం కాదన్నారు స్టాలిన్.






