ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే
పాలమూరు జిల్లా : జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నియోజకవర్గంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. విచిత్రం ఏమిటంటే తన స్వంత ఊరు రంగారెడ్డి గూడలో ఊహించని షాక్ ఇచ్చారు ఎమ్మెల్యేకు గ్రామస్థులు. ఇక్కడ తను బలపర్చిన అభ్యర్థిని దారుణంగా ఓడించారు. ఈ సందర్బంగా సోమవారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన సొంత ఊరు ప్రజలే తాను బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని ఓడించడం దారుణమన్నారు. తాను ఈ తీర్పును జీర్ణించుకోలేక పోతున్నానని వాపోయాడు.
రూ.1.50 కోట్లు ఇచ్చి సర్పంచ్ అభ్యర్థిని నిలబెడితే, ప్రజలు అతన్ని ఓడించి నా గుండెల మీద తన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి. ఇదిలా ఉండగా పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కూడా జనం ఝలక్ ఇచ్చారు. తమ స్వంత ఊళ్లలో చేతులెత్తేశారు. తమకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. జడ్చర్ల ఎమ్మెల్యేకే కాదు దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలకు కూడా ప్రజలు కోలుకోలేని రీతిలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా తాజాగా నిత్యం కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే అనిరుధ్ రడ్డికి ఈ తీర్పు కోలుకోలేని షాక్ .






