తనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడాన్ని తప్పు పట్టారు
ఢిల్లీ : తనకు ఈడీ మరోసారి నోటీసు ఇవ్వడం, ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. తాను మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్‌ను కలవాల్సి ఉందన్నారు. అలాగే రాహుల్ గాంధీ , సోనియా గాంధీని కలిశానని చెప్పారు డీకే శివకుమార్. ఈరోజు తాను దావణగెరె వెళ్లాల్సి ఉందని, అక్కడ ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ను కలవాల్సి ఉందని చెప్పారు.
ప్రస్తుతం వాతావరణం అనుకూలించడం లేదని, అందుకే కొంత ఆలస్యం అవుతోందని అన్నారు డీకే శివకుమార్. ఇదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నోటీసు ఇవ్వడంపై స్పందించారు. ఇదే సమయంలో ఢిల్లీ పోలీసు నోటీసు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. ఇది అత్యవసరం కాబట్టి నేను ఈరోజు వెళ్లాల్సి ఉంది. నేను వచ్చే వారం వరకు సమయం అడుగుతున్నానని అన్నారు. నేను ఈడీకి అన్ని సమాధానాలు ఇచ్చానని చెప్పారు డీకే శివకుమార్. కాబట్టి నాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా కావాలి, దాని కోసం అడుగుతున్నానని తెలిపారు. అందులో ఏముందో నాకు తెలియదు కాబట్టి నేను ఎఫ్ఐఆర్ కాపీని అడగాల్సి వచ్చిందన్నారు. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాల తర్వాత, నేను వచ్చి నాకు ఇచ్చిన నోటీసుకు స్పందిస్తానని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.






