అందరి కళ్లు ఈ కంటెస్టెంట్ పైనే
హైదరాబాద్ : పూర్తి వినోదాన్ని అందిస్తూ టాప్ రేటింగ్ లో దూసుకు పోతోంది స్టార్ లో బిగ్ బాస్ -9 తెలుగు సీజన్. ఈ షో ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు ఐదుగురు ఫైనల్ దాకా వచ్చారు. చివరి ఫైనలిస్టులో ముగ్గురు చేరుకున్నారు. వారిలో శ్రీకాంత్ పెద్దాల, ఇమ్మాన్యూయెల్ తో పాటు తనూజ నిలిచారు. వీరిలో ఓటింగ్ పరంగా చూస్తే టాప్ లో కొనసాగుతోంది తనూజ. ఈనెల 21వ తేదీన గ్రాండ్ పినాలే జరగనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు నిర్వాహకులు. ఇప్పటి దాకా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున దీనిని హోస్ట్ చేస్తూ వచ్చారు.
చివరి దాకా ఇమ్మాన్యూయెల్ తనూజ మధ్య కీలకమైన పోటీ నెలకొందని టాక్. కానీ ఇప్పటికే తనూజ ఫైనల్ అయ్యిందని , ఇక మిగిలింది తను ట్రోఫీ తీసుకోవడం, ప్రైజ్ మనీ తీసుకునేందుకు రెడీగా ఉండాలని ఇప్పటికే సమాచారం కూడా అందినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పెద్ద ఎత్తున తనూజకు మద్దతుగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. తను ఆడిన తీరు, ప్రదర్శించిన తెలివి తేటలు కలిపి తనను టాప్ లో ఉండేలా చేశాయని సమాచారం. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ షో అలరిస్తూ వచ్చింది. అయితే ఇంకా సస్పెన్స్ వీడడం లేదు. ఎవరు విన్నర్ గా నిలుస్తారనే దానిపై. నిర్వాహకులు ఇంకా ప్రకటించ లేదు. మొత్తంగా సోషల్ మీడియాలో మాత్రం తనూజ పేరు ట్రెండ్ లో కొనసాగుతోంది.







