చంద్ర బాబుకు మతి చెడింది
మాజీ మంత్రి కొడాలి నాని
కృష్ణా జిల్లా – మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు. మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లడారు. తాను తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఎవరు ఆహ్వానిస్తే ఎవరిది దుకాణం బంద్ అవుతుందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలంటూ పేర్కొన్నారు .
చంద్రబాబుకు మైండ్ దొబ్బిందంటూ ఎద్దేవా చేశారు. కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చినా ఇంకా బుద్ది రాలేదన్నారు. బాబు పగటి కలలు కంటున్నాడని, ఆయన మాటల్ని ప్రజలు వినే పరిస్థితుల్లో లేరన్నారు కొడాలి నాని.
తాము గనుక డోర్స్ ఓపెన్ చేస్తే టీడీపీలో తండ్రి, కొడుకు తప్ప ఎవరూ మిగలరన్నారు. తమ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు కామెంట్స్ చేస్తున్నాడో బాబుకే తెలియాలన్నారు. రా కదలిరా అంటూ జనంలోకి వెళుతున్న ఆయనను ఎవరూ పట్టించు కోవడం లేదంటూ సెటైర్ వేశారు కొడాలి నాని.
2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారని, ఇప్పుడు ఆయన అంతకు మించి చేసేది ఏముంటుందని ప్రశ్నించారు. సీఎం జగన్ 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా చర్యలు చేపట్టారని తెలిపారు. పీకేసిన ఐదారుగురు మాత్రమే బాబు వద్దకు చేరుకున్నారని అన్నారు.